»Hyderabad Is An Excellent Environment For Investment Ktr
Bio Asia meeting :పెట్టుబడులకు హైదరాబాద్ అద్భుతమైన వాతావరణం : కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారులు, పెట్టుబడులకు (investments) అద్బుతమైన వాతావరణం ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల బయో ఏషియా ( Bio Asia ) సదస్సు విజయవంతంగా నిర్వహించుకున్నాం అని ఆయన తెలిపారు. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం మరిన్ని సీఐఐ( CII ) సదస్సులు నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారులు, పెట్టుబడులకు (investments) అద్బుతమైన వాతావరణం ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల బయో ఏషియా ( Bio Asia ) సదస్సు విజయవంతంగా నిర్వహించుకున్నాం అని ఆయన తెలిపారు. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం మరిన్ని సీఐఐ( CII ) సదస్సులు నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బేగం పేటలో(Begum Pet) ఏర్పటు చేసిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. లైఫ్ సైన్సెస్ (Life Sciences) రంగంలో ఇన్వెస్ట్ మెంట్ లకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్స్ రెట్టింపు అయ్యాయి. 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ (Hyderabad)నగరానికి ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయి. 9 బిలియన్ టీకాలు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారు అవుతున్నాయని ఆయన తెలిపారు.
ప్రపంచంలో అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన డివైజెస్ పార్కులోనే ఉందన్నారు. తెలంగాణలో అతి పెద్ద మొబిలిటీ (Mobility)వ్యాలీని ఏర్పాటు చేశాం. దేశానికే హైదరాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతుందని కేటీఆర్ వెల్లడించారు. ఫార్మా పరిశ్రమలకు ఒకే చోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సుల్తాన్పూర్ (Sultanpur)వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు చేశామని తెలిపారు. లైఫ్ సైన్సెస్‌తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందన్నారు. కొంగరకలాన్‌లో(Kongarakalan) ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. ఫాక్స్‌కాన్(Foxconn) సంస్థకు 200 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని హైదరాబాద్ చుట్టూ ఉండే పరిశ్రమలకు నీటి సమస్య కూడా లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
IT & Industries Minister @KTRBRS delivered the inaugural address at @FollowCII Telangana State Annual Meeting 2022-23 & Conference on Beyond India@75. pic.twitter.com/JjEdzCN9zG