ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ మూవీ నుంచి నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నారనే వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్లో, ఇతర అప్డేట్స్లో ఆయన పేరు లేకపోవడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. గతంలో ఆయన ఈ వార్తలను ఖండించినప్పటికీ, తాజా పరిణామాలు ఆయన ప్రాజెక్టులో లేరనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.