»Celebrating 40 Years Of Meena In The Film Industry
Meena : ఘనంగా మీనా సినీ పరిశ్రమలో 40 ఏళ్ళ వేడుకలు..
నటి మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా మీనా(Meena) సినీ పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్ళు అయిన సందర్భంగా చెన్నైలో(Chennai) ఓ ఈవెంట్ నిర్వహించారు.
నటి మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా మీనా(Meena) సినీ పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్ళు అయిన సందర్భంగా చెన్నైలో(Chennai) ఓ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి రజినీకాంత్, బోణి కపూర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్ కి అలనాటి తారలు రాధికా, రోజా, సంఘవి, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి, దేవయాని, పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు.
స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకా ఉంటారట కదా.అచ్చం అలానే ఒకప్పటి హీరోయిన్ మీనా ని చూస్తే నిజంగా మేనకానే దివికి దిగివచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. ఆమె అందమైన నటనతో, నాట్యంతో సుమారు 10 సంవత్సరాలు పాటు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా మనల్ని అలరించిన మీనా.
సుదీర్ఘకాలం పాటు హీరోయిన్గా అగ్రహీరోలందరితో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని సొంతం చేసుకుంది.అయితే 1975 సెప్టెంబర్ 16 న జన్మించిన మీనా మొదట బాలనటిగా ‘ఇల్లాలు ప్రియురాలు’, ‘బావ మరదలు’, రెండు రెళ్ళ ఆరు, సిరివెన్నెల లాంటి సినిమాలతో అందరిని మెప్పించి.‘నవయుగం’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్గా పరిచయం అయ్యారు.
ఆ తర్వాత సీతారామయ్య గారి మనమరాలు సినిమాతో మంచి గుర్తింపు రావడంతో ఇక వరసపెట్టి అవకాశాలను అందిపుచ్చుకుంది.సుందరకాండ, అల్లరి పిల్ల, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ముత్తు, సూర్యవంశం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలక్రిష్ణ, రజనీకాంత్ లతో జోడి కట్టి టాప్ హీరోయిన్గా అప్పట్లో ఒక వెలుగు వెలిగింది.
ఇక 2000 సంవత్సరం తర్వాత ఆమెకి హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో 2009 లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినా విద్యాసాగర్ ను పెళ్ళిచేసుకొని సెట్టిల్ అయిపోయింది. ఇక మీనాకి ఒక కూతురు కూడా ఉంది.ఇక నటి మీనా భర్త ఈ ఏడాది అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు.