»Fox Con Chairmans Letter To Cm Kcr Committed To Setting Up The Plant
Foxconn : సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ ఛైర్మన్ లేఖ.. ప్లాంట్ ఏర్పాటుకు కట్టుబడి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ (CM KCR) చేస్తున్న కృషి, ఆయన విజన్ తనకు ఎంతో ప్రేరణ ఇచ్చిందని ఫాక్స్‌కాన్ చైర్మెన్(Foxconn Chairman) యంగ్ లియూ(Young Liu) అన్నారు. కొంగరకలాన్ (Kongarakalan) లో ఫాక్స్‌కాన్ ఉత్పత్తి తయారీ కేంద్రన్ని ఏర్పటు చేసేందుకు తాము కట్టబడి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ (CM KCR) చేస్తున్న కృషి, ఆయన విజన్ తనకు ఎంతో ప్రేరణ ఇచ్చిందని ఫాక్స్‌కాన్ చైర్మెన్(Foxconn Chairman) యంగ్ లియూ(Young Liu) అన్నారు. కొంగరకలాన్ (Kongarakalan) లో ఫాక్స్‌కాన్ ఉత్పత్తి తయారీ కేంద్రన్ని ఏర్పటు చేసేందుకు తాము కట్టబడి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు. తన బర్త్‌డే సందర్భంగా కేసీఆర్ విషెస్ తెలిపారని, అలాగే తనకు పర్సనల్‌గా గ్రీటింగ్ కార్డు (Greeting card) ఇవ్వడం పట్ల లియూ థ్యాంక్స్ తెలిపారు. తెలంగాణ (Telangana) రాష్ట్రాభివృద్ధి పట్ల మీకు ఉన్న విజన్ (KCR vision) నన్ను ఎంతో ప్రేరణకు గురిచేసిందని లియూ అన్నారు. ఇండియాలో తనకు ఓ కొత్త ఫ్రెండ్ దొరికినట్లు లియూ తన లేఖలో చెప్పారు. భవిష్యత్తులోనూ కేసీఆర్‌తో కలిసి పనిచేసేందకు ఉత్సాహాంగా ఉన్నట్లు తెలిపారు.
మార్చి 2వ తేదీన జరిగిన సమావేశంలో తమతో చర్చించినట్లుగా నా వ్యక్తిగత అతిథిగా మిమ్మల్ని తైవాన్‌కు (Taiwan)ఆహ్వానిస్తున్నాను.. తైపీలో మీకు ఆతిథ్యం ఇవ్వడం నా గౌరవం.. త్వరలో మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నాను’ అంటూ చైర్మన్ లియూ లేఖలో తెలిపారు. కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీ (Factory) వల్ల లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఆదిబట్ల మున్సిపాలిటీ(Adibatla muncipality) పరిధిలోని కొంగరకలాన్‌లో రూ.3500 కోట్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీని నెలకొల్పేందుకు తైవాన్ దేశం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించింది. ఇందుకుగాను రెవెన్యూ (Revenue) అధికారులు, టీఎస్ఐఐసీ (TSIIC) అధికారులు రెండు మూడు నెలలుగా సర్వే చేసి భూమిని సిద్ధంగా ఉంచారు. మిగతా భూమిని త్వరలోనే సేకరిస్తామని తెలిపారు.