»Eight Parties Write To Pm On Manish Sisodia Arrest
Letter to PM modi: సిసోడియా అరెస్ట్ పై కెసిఆర్, కేజ్రీ, మమతా లేఖ
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం (delhi liquor scam) కేసులో మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పైన (former Delhi deputy CM Manish Sisodia's arrest by CBI, Delhi CM and AAP national convener) భారత రాష్ట్ర సమితి సహా ఎనిమిది పార్టీలు భారత ప్రధాని (prime minister of India) నరేంద్ర మోడీకి (Narendra Modi) లేఖ రాశాయి.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం (delhi liquor scam) కేసులో మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పైన (former Delhi deputy CM Manish Sisodia’s arrest by CBI, Delhi CM and AAP national convener) భారత రాష్ట్ర సమితి సహా ఎనిమిది పార్టీలు భారత ప్రధాని (prime minister of India) నరేంద్ర మోడీకి (Narendra Modi) లేఖ రాశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పి దుర్వినియోగం చేయడంపై, గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, బిఆర్ఎస్ అధ్యక్షులు కెసిఆర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సహా ఎనిమిది పార్టీల నేతలు… ప్రధాని నరేంద్ర మోడీకి ఈ లేఖ రాశారు. భారతదేశం ఇప్పటికీ ప్రజాస్వామిక దేశమేననే విషయాన్ని మీరు అంగీకరిస్తారని భావిస్తున్నామని కానీ, అలాంటి ఆధారాలు లేకుండా విపక్ష నేతల పైకి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ వాటిని దారుణంగా దుర్వినియోగం చేస్తున్న ఈ తీరును చూస్తుంటే దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశపాలన వైపు మళ్లిందేమోననే భావన కలుగుతోందని అందులో పేర్కొన్నట్లు సీఎం కేసీఆర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లేఖ రాసిన వారిలో కెసిఆర్, మమత, కేజ్రీవాల్ ల తో పాటు భగవంత్ మాన్ (ఆమ్ ఆద్మీ పార్టీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), శరద్ పవార్ (ఎన్సీపీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన యూబీటీ), అఖిలేశ్ (ఎస్పీ) ఉన్నారు. అయితే దీనికి కీలక ప్రతిపక్షం కాంగ్రెస్, డీఎంకే, జేడీయూ, జేడీఎస్ పార్టీలు, ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారు.
బీజేపీ కౌంటర్
ప్రధాని మోడికి విపక్షాలు రాసిన ఈ లేఖపై బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేదీ తీవ్రంగా స్పందించారు. తాము దేశ సర్వతో ముఖాభివృద్ధి కోసం కృషి చేస్తుంటే విపక్షాలు తమపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి పరస్పరం కాపాడుకోవడానికి కృషి చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ లేఖ రాసిన వారిలో చాలామంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారేనని, కొందరైతే రెండు తరాలుగా అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పై ఆప్ ఆగ్రహం
సిసోడియ వ్యవహారంలో తమకు అండగా నిలవని కాంగ్రెస్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. కాంగ్రెస్, బీజేపీ.. రెండూ ఒకే తాను ముక్కలు అని, ఇతర పార్టీలేవీ మనుగడ సాగించకూడదనే కోరుకుంటాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ప్రతిపక్షాల పక్కన కాంగ్రెస్ ఎప్పుడూ నిలిచిన చరిత్ర లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం కేవలం దేశాన్ని ఫూల్ చేయడానికేనని ఆరోపించారు. జాతీయ అంశాలపై నిలబడి గొంతెత్తాల్సిన సమయాల్లో ఆ పార్టీ కనపడకుండా పోతుందన్నారు. ఇప్పుడు కూడా ప్రధాని మోడీకి విపక్షాల లేఖ విషయంలో అదే జరిగిందన్నారు. తనను తాను పెద్దన్నగా భావించుకుంటూ, విపక్ష కూటమి అంటూ ఏదైనా ఏర్పడితే దానికి నాయకత్వం వహిస్తానని చెప్పుకొనే కాంగ్రెస్ ఈ లేఖ విషయంలో కలిసొస్తే బాగుండేదన్నారు.