TG: కేవలం 45 నిమిషాల ఛార్జింగ్‌తో 250 కిలోమీటర్లు ప్రయాణించే అధునాతన బస్సులు త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌కు రానున్నాయి. 1085 విద్యుత్ బస్సుల సరఫరా, నిర్వహణకు ఈవీ ట్రాన్స్ లిమిటెడ్ ద్వారా రెండు కాంట్రాక్టులను (LOA) ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థ దక్కించుకుంది. అన్ని కుదిరితే ఈ బస్సులను 20 నెలల్లో విడతల వారీగా ఆర్టీసీకి అందించనుంది.