Virat Kohli ఆలయంలో విరుష్క జోడీ.. తెల్లవారుజామునే లేచి
ఈ సందర్భంగా కోహ్లీ, అనుష్క సంప్రదాయ వస్త్రధారణ చేశారు. విరాట్ ధోతీ ధరించగా అనుష్క లేత గులాబీ రంగు చీర ధరించింది. వీరిద్దరూ గతంలో రిషికేశ్ (Rishikesh)లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమాన్ని సందర్శించారు. అంతకుముందు బాబా నీమ్ కరోలీ ఆశ్రమంలో గడిపారు.
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడో టెస్టు ముగిసింది. భారత్ పరాజయం పొంది భారత్ అభిమానులను నిరాశలో ముంచింది. అయితే మ్యాచ్ లు ముగియడంతో కొంత విరామం దొరికిందని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన భార్య, హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma)తో కలిసి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని (Ujjain Shree Mahakaleshwar Temple) సందర్శించాడు. తెల్లవారుజామున 4 గంటలకు పరమశివుడి సేవలో ఆ దంపతులు (Virushka Couple) మునిగారు. అంతకుముందు రోజే ఇటీవల పెళ్లయిన అక్షర్ పటేల్ (Axar Patel దంపతులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు. వారం రోజుల వ్యవధిలో భారత క్రికెటర్లు (Indian Cricketers) వరుసగా ఈ ఆలయానికి వచ్చారు. కాగా కోహ్లీ, అనుష్క పూజలు చేస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
నాలుగో టెస్టు అనంతరం ఇండోర్ కు సమీపంలోనే ఉన్న ఉజ్జయిని ఆలయాన్ని కోహ్లీ తన భార్యతో కలిసి సందర్శించాడు. అయితే శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయంలో నిర్వహించిన భస్మ హారతిలో విరుష్క దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోహ్లీ, అనుష్క సంప్రదాయ వస్త్రధారణ చేశారు. విరాట్ ధోతీ ధరించగా అనుష్క లేత గులాబీ రంగు చీర ధరించింది. వీరిద్దరూ గతంలో రిషికేశ్ (Rishikesh)లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమాన్ని సందర్శించారు. అంతకుముందు బాబా నీమ్ కరోలీ ఆశ్రమంలో గడిపారు. వాటి సందర్శన తర్వాతే కోహ్లీ సెంచరీ చేశాడని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా ఉజ్జయిని ఆలయం సందర్శనతో ఐదో టెస్టులో కోహ్లీ సెంచరీ చేస్తారనే ఆశలో అభిమానులు మునిగిపోయారు.
కాగా ఆస్ట్రేలియా (India Vs Australia)తో జరిగిన సిరీస్ (Series)లో కోహ్లీ మూడు టెస్టులు (Test Match) ఆడాడు. మూడు టెస్టుల్లో విరాట్ కేవలం 113 పరుగులు మాత్రమే నమోదు చేశాడు. మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానున్న ఆఖరి టెస్టులో కోహ్లీ సత్తా చాటుతాడని అందరూ భావిస్తున్నారు. ఉజ్జయిని ఆలయాన్ని కొన్ని రోజుల వ్యవధిలోనే భారత క్రికెటర్లు వరుసగా సందర్శించారు. సూర్య కుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తదితరులు ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
Virat Kohli is the richest cricketer in the world , most successful too and he's face of the sport yet being humble and following his religion practices with at most respect and conduct . pic.twitter.com/AZg0Mm2ag6