శ్రద్ధా దాస్ మార్చి 4, 1987న మహారాష్ట్రలోని ముంబయిలో ఓ బెంగాలీ ఫ్యామిలీలో జన్మించింది
ఈమె తండ్రి సునీల్ దాస్ ఓ వ్యాపారవేత్త, ఆమె తల్లి సప్నా దాస్ గృహిణి
ఆమె ముంబయిలోనే పెరిగి, అక్కడే తన చదువును పూర్తి చేసింది
ముంబై విశ్వవిద్యాలయం నుంచి SIES కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది
ఆ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆర్టిస్టులు పీయూష్ మిశ్రా, చిత్తరంజన్ గిరి, సలీం షా నిర్వహించే వర్క్‌షాప్‌లకు హాజరైంది.
ఆ క్రమంలో 2008లో తొలిసారిగా సిద్దూ ఫ్రమ్ సికాకుళం అనే తెలుగు చిత్రంతో తన నటనను ప్రారంభించింది
తర్వాత డైరీ, ఆర్య2, డార్లింగ్, మరో చరిత్ర, నాగవల్లి, బందిపోటు వంటి చిత్రాల్లో గుర్తింపు దక్కించుకున్న శ్రద్ధా దాస్
ఆ తర్వాత హిందీ, కన్నడ, తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో శ్రద్ధా దాస్ యాక్ట్ చేసింది
చివరిగా తెలుగులో ఏక్ మిని కథ, కోటిగొబ్బ 3 కన్నడ చిత్రాల్లో 2021లో నటించింది
ప్రస్తుతం నిరీక్షణ, అర్దం అనే సినిమాల్లో ప్రాజెక్టులు చేస్తోంది
చదవండి: Anushka Sharma sacrifices: భార్య త్యాగం చేసిందన్న కోహ్లీ
Tags :