»Anushka Has Made Massive Sacrifices As A Mother Says Virat Kohli
Anushka Sharma sacrifices: భార్య త్యాగం చేసిందన్న కోహ్లీ
విరాట్ కోహ్లీ (Anushka Sharma) - అనుష్క శర్మ (Anushka Sharma) క్రేజీ కపుల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ తన భార్య తల్లిగా ఎంతో త్యాగం చేసిందని చెబుతూ ప్రశంసలు కురిపించాడు. అనుష్కను చూసి స్ఫూర్తి పొందుతానని చెప్పాడు.
విరాట్ కోహ్లీ (Anushka Sharma) – అనుష్క శర్మ (Anushka Sharma) క్రేజీ కపుల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ తన భార్య తల్లిగా ఎంతో త్యాగం చేసిందని చెబుతూ ప్రశంసలు కురిపించాడు. అనుష్కను చూసి స్ఫూర్తి పొందుతానని చెప్పాడు.
కూతురు వామిక తమ జీవితంలోకి వచ్చాక ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పాడు కోహ్లీ. వామికను చూసుకునే క్రమంలో అంటే ఈ రెండేళ్లలో గొప్ప త్యాగాలు చేసిందన్నాడు.
అనుష్క శర్మను చూస్తే నేను నా జీవితంలో ఎలాంటి పెద్ద సమస్యను అయినా ఎదుర్కోగలననే నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడ్డాచు. ఆమెను చూస్తే తనకు ఉన్న సమస్యలు పటాపంచలు అవుతాయన్నాడు. అమె నా ధైర్యం అన్నాడు. జీవితం పట్ల అనుష్క దృక్పథం భిన్నంగా ఉంటుందని చెప్పాడు
మీరు మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నంత కాలం.. ఏదీ ఆశించలేరని, ఎందుకంటే అది ప్రాథమిక అవసరం అన్నాడు. ఒక వ్యక్తితో పూర్తిగా ప్రేమలో మునిగితే అది జీవితాన్ని ప్రభావితం చేస్తుందన్నాడు.
సహజంగానే అనుష్క తనకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పాడు. జీవితంలో ఏం జరిగినా అంగీకరిస్తూ ముందుకు సాగిపోవడం నేర్చుకున్నట్లు చెప్పాడు.