తూ.గో: గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సి)లో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైద్య సిబ్బంది, కూటమి నాయకులు కలిసి ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.