విశాఖ మధురవాడలో ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైకిల్ యాత్ర నిర్వహించారు. మిధులాపురి వుడా కాలనీలోని గాంధీ విగ్రహం నుంచి మొగధారమ్మ పార్కు వరకు సాగిన యాత్ర అనంతరం మొక్కలు నాటారు. ప్రకృతి, సహజ వనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, పచ్చదనం పెంపుతో పాటు ఇంధనాన్ని పొదుపుగా వినియోగించాలన్నారు.