minister jagadish reddy:ఫైరవీ అక్కర్లేదు, బానిసలు ఎవరు లేదు..గవర్నర్‌పై మంత్రి జగదీశ్ గుస్సా
minister jagadish reddy:తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) మధ్య వివాదం కంటిన్యూ అవుతుంది. ఈ రోజు గవర్నర్ తమిళి సై (Tamilisai Soundararajan) స్పందించారు. సుప్రీంకోర్టు (supreme court) కన్నా రాజ్ భవన్ (raj bhavan) దగ్గర ఉంది.. డియర్ శాంతి కుమారి అంటూ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి జగదీశ్ రెడ్డి (jagadish reddy) కౌంటర్ ఇచ్చారు.
minister jagadish reddy slams governer Tamilisai Soundararajan
minister jagadish reddy:తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) మధ్య వివాదం కంటిన్యూ అవుతుంది. తాజాగా బిల్లుల (bills) ఆమోదం అంశం అగ్గిరాజేసింది. 10 బిల్లులకు (10 bills) గవర్నర్ (governer) ఆమోదం తెలుపలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (shanti kumari) సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు గవర్నర్ తమిళి సై (Tamilisai Soundararajan) స్పందించారు. సుప్రీంకోర్టు (supreme court) కన్నా రాజ్ భవన్ (raj bhavan) దగ్గర ఉంది.. డియర్ శాంతి కుమారి అంటూ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి జగదీశ్ రెడ్డి (jagadish reddy) కౌంటర్ ఇచ్చారు.
ఫైళ్ల క్లియరెన్స్‌కు గవర్నర్ వద్ద ఫైరవీ చేయాల్సిన అవసరం తమకు లేదని జగదీశ్ రెడ్డి అన్నారు. తాము ఇచ్చిన బిల్లుల (bills) చట్టబద్దం అయినవి అని.. వాటిని ఆమోదించడం గవర్నర్ విధి అని తెలిపారు. గవర్నర్‌కు బానిసలు (slave) ఎవరూ లేరని చెప్పారు. పెండింగ్ పైళ్ల విషయంలో గవర్నర్ అహంకారంగా చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే తమ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టిందని చెప్పారు. అక్కడ తమకు న్యాయం జరుగుతుందనే ధీమా వ్యక్తం చేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వంపై కూడా ఫైరయ్యారు. వంట గ్యాస్ ధరలు పెంచడం మోడీ సర్కార్ (modi government) దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పారు. ఈ అంశంపై జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని వివరించారు.
పెండింగ్ బిల్లుల గురించి తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (supreme court) తలుపు తట్టింది. ప్రభుత్వం ప్రతిపాదించిన 10 బిల్లులు (10 bills) పెండింగ్ పెట్టారని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. పెండింగ్ బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. పిటిషన్లో ప్రతివాదిగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను (governer Tamilisai Soundararajan ) చేర్చారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 10 బిల్లులను (10 bills) గవర్నర్ ఆమోదించలేదని ప్రభుత్వం చెబుతోంది.
మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, అటవీ వర్సిటీ అప్ గ్రేడ్ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయి మెంట్ చట్ట సవరణ బిల్లు, మోటార్ వెహికిల్ టాక్సేషన్ సవరణ బిల్లు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సవరణ బిల్లు పెండింగ్‌లో ఉన్నాయి.