TG: సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ ద్రోహి అని KTR అనడం సరికాదని ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్ అని ఆరోపించారు. ఆయన పాలనలో రాష్ట్ర ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతికారన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఓ కుటుంబ తండ్రిలా ఉంది అని అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయంతో పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.