AP: కాసేపట్లో సీఎం చంద్రబాబు క్యాంప్ ఆఫీస్ వేదికగా కూటమి నేతలు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, SIR అమలు, రాజ్యసభ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక ఇతర అంశాలపై నేతలు చర్చించనున్నారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, TDP AP అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొననున్నారు.