»Oleg Deripaska Said Russia Will Run Out Of Money If No Investment Comes It Will Be Difficult In 2024
Russia: రష్యాలో డబ్బు అయిపోతుంది…పెట్టుబడులు రాకుంటే 2024లో కష్టాలే!
పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యాలో నగదు నిల్వలు తగ్గుతున్నాయని అక్కడి ఇంధన లోహ రంగ వ్యాపారవేత్త రష్యా ఒలిగార్చ్ ఒలేగ్ డెరిపాస్కా తెలిపారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నాటికి “స్నేహపూర్వక” దేశాల నుంచి పెట్టుబడులు రాకపోతే నగదు నిల్వలు సున్నా స్థాయికి చేరుకుంటాని చెప్పారు.
పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యా(Russia)లో నగదు నిల్వలు తగ్గుతున్నాయని అక్కడి ఇంధన, లోహ రంగ వ్యాపారవేత్త ఒలిగార్చ్ ఒలేగ్ డెరిపాస్కా(Oleg Deripaska) తెలిపారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది(2024) నాటికి “స్నేహపూర్వక” దేశాల నుంచి పెట్టుబడులు(investments) రాకపోతే నగదు(cash) నిల్వలు సున్నా(zero) స్థాయికి చేరుకుంటాని చెప్పారు. ఒకప్పుడు ధనవంత దేశంగా ఉన్న రష్యా(Russia)లో త్వరలో డబ్బు(money) ఉండదని.. మాకు విదేశీ పెట్టుబడిదారులు కావాలని పేర్కొన్నారు. సైబీరియాలో గురువారం జరిగిన పెట్టుబడుల సదస్సులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై దాడి చేసినందుకు.. రష్యాకు వ్యతిరేకంగా US, UK, EU విధించిన ఆంక్షలు కూడా వ్యాపారంపై ప్రభావం చూపాయని తెలిపారు. దీంతో అనేక మంది వారి వ్యాపారాలను(business mans) ఇతర దేశాల్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
మేము యూరోపియన్(european union) దేశం తమదని అనుకున్నామని వెల్లడించారు. కానీ ఇప్పుడు 25 ఏళ్లు తమకు ఆసియా(asia)తో ఉన్న సంబంధాల గురించి మరింత ఆలోచిస్తున్నామని ఒలేగ్ డెరిపాస్కా(Oleg Deripaska) అన్నారు. మాస్కో జీడీపీ(moscow gdp)లో 2% అంచనాతో పోల్చితే రష్యా(Russia) బడ్జెట్ లోటు స్థూల జాతీయోత్పత్తి (GDP)లో 3.5%కి పెరగవచ్చని యూరోపియన్ రేటింగ్ ఏజెన్సీ స్కోప్(scope) తెలిపింది. చమురు, గ్యాస్ ఎగుమతుల ద్వారా రాబడులు తగ్గడం వల్లే ఇలా పతనమైందని ఏజెన్సీ(agency) పేర్కొంది.
ఆంక్షలు, యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక సౌలభ్యాన్ని నిరోధిస్తున్నాయి. తక్కువ ఇంధన ఎగుమతి ఆదాయాలు, అధిక యుద్ధ సంబంధిత వ్యయం కారణంగా GDPలో స్థిరమైన క్షీణత ఏర్పడిందని స్కోప్(scope) పేర్కొంది. ప్రస్తుతానికి జాతీయ సంపద నిధిని తగ్గించడం ద్వారా రష్యా తన లోటును సులభంగా భర్తీ చేయగలదు. 2021 చివరినాటికి జీడీపీలో 10.4 శాతం నుంచి 2024 చివరి నాటికి జీడీపీ(GDP)లో 3.7 శాతానికి చేరుకుంటుందని స్కోప్ అంచనా వేసింది.