RR: కొందుర్గు ప్రభుత్వ ఆసుపత్రిని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సులోచన కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. డ్యూటీ డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్ గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా పాముకాటు, కుక్కకాటు మందులను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఆయన రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.