GNTR: తెనాలి మారసుపేటలోని ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు, శిక్షకులు పాల్గొని వంట వారికి సహాయకులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పున ప్రారంభమవుతున్న దృష్ట్యా అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.