KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.261 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. మండుతున్న ఎండల ప్రభావంతో ప్రాజెక్టు నుంచి రోజుకు సుమారు 181 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.