KNR: చిగురుమామిడి మండలం ఇందుర్తి చెరువు శిఖం భూములను బుధవారం నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. ఇందుర్తి చెరువు శిఖం భూములను పలువురు రైతులు మట్టిపోసి కబ్జా చేస్తున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. నీటిపారుదల శాఖ ఏఈ లక్పతితో చెరువును పరిశీలించారు. కబ్జాకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.