NZB: నగరంలోని ఇస్లాంపూర, ఖోజా కాలనీ ప్రాంతాల్లో పోలీసులు బుధవారం ఆకస్మిక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు, ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో టౌన్-1 ఇన్స్పెక్టర్ బి. రఘుపతి ఆధ్వర్యంలో 70 మంది సిబ్బందితో ఈ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు.