టీమిండియా టీ20 జట్టుకు కొత్త కోచ్‌ను నియమించబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ఒకవేళ కొత్త కోచ్‌ను తీసుకోవాలనుకుంటే, అందుకు ఆశిష్ నెహ్రా సరైన వ్యక్తని సూచించాడు. నెహ్రా క్రికెట్‌ను చాలా సూక్ష్మంగా అంచనా వేస్తాడన్నాడు. అంతేకాకుండా, GT జట్టును హెడ్‌కోచ్‌గా విజయవంతంగా నడిపించిన అనుభవం కూడా ఉందన్నాడు.