RCB స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ బాసు శంకర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు 8 ఏళ్ల పాటు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా తన సేవలను అందించాడు. ప్లేయర్ల ఫిట్నెస్ పెంపొందించడంలో అతడి పాత్ర చాలా కీలకం. గతంలో అతడు భారత క్రికెట్లో యో-యో టెస్టును ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాడు. కాగా, శంకర్ రిటైర్మెంట్పై RCB ఓ భావోద్వేగ పోస్ట్‌ను ‘X’లో షేర్ చేసింది.