ASR: ఏఐ సాయంతో చిన్న పిల్లల్లో ఉండే లోపాలను గుర్తిస్తే, సకాలంలో వైద్యం అందించి వైకల్యాల బారిన పడకుండా కాపాడవచ్చని కలెక్టర్ నిశాంతి తెలిపారు. చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించేందుకు ఉద్దేశించిన “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ స్క్రీనింగ్” శిక్షణ మంగళవారం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.