E.G: నిడదవోలు జడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూర్యారావు (సూరిబాబు)ను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకానికి సంబంధించిన పదవీకాలం 3 సంవత్సరాలు ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను సమర్థంగా, సమానంగా అందేలా కృషి చేస్తానని సూరిబాబు పేర్కొన్నారు.