NZB: అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను ఇక్కడి అస్తిత్వాన్ని కనుమరుగు చేయడానికి కొన్ని శక్తులు మళ్లీ కుట్రలు పన్నుతున్నాయని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం బాల్కొండలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమానికి, పోరాటానికి ప్రతి బిడ్డ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.