AP: ‘మావిగన్’లో అన్ని సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని జగన్ పునరుద్ఘాటించారు. ‘విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంది. మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చింది. మేమే మొదలుపెట్టి, నిధుల కొరత లేకుండా చూశాం. ఈ 2 చోట్ల జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్లు ఉన్నాయి. గుంటూరు అభివృద్ధి చెందింది. అందుకే ‘మావిగన్’ను గ్రోత్ కారిడర్గా ప్రకటిస్తే చాలు వెంటనే అభివృద్ధి చెందుతుంది’ అని జగన్ అన్నారు.