AP: అమరావతిలో మౌలిక వసతుల కోసమే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని YCP అధినేత జగన్ అన్నారు. ‘అమరావతిలో కనీస సౌకర్యాల కోసం ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా రోడ్లు వేయడానికి, డ్రైనేజీ తవ్వడానికి, నీళ్లు, కరెంట్ ఇవ్వడానికే డబ్బును వెచ్చించాలి. వీటి కోసమే దాదాపు రూ.2 లక్షల కోట్లను ఖర్చు పెట్టాలి. అందుకే ప్రత్యామ్నాయంగా ‘మావిగన్’ను సూచించాము’ అని జగన్ పునరుద్ఘాటించారు.