భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉష్ణోగ్రత తగ్గు ముఖం పడుతోంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా సీతారాంపట్నం మినహా అన్ని మండలాల్లో 39.6°C కంటే తక్కువ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. పాల్వంచ మండలం సీతారాంపట్నంలో అత్యధికంగా 41.3°C ఉష్ణోగ్రత రికార్డు అయింది. దమ్మపేట మండలం నాయుడుపేటలో అత్యల్పంగా 35.7°C ఉష్ణోగ్రత నమోదయింది.