PDPL: కమాన్ పూర్ మండలం గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు సోమవారం ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ కాశిమల్ల సుధాకర్ అధ్యక్షతన సర్పంచ్ జంగిలి పోచాలు ఈ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ప్రభుత్వం ఉచిత పుస్తకాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం కల్పిస్తోందని, ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.