WGL: వరంగల్ ఉర్సులోని శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం నూతన ఈవోగా కట్కూరి వెంకటయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఈవో ప్రసాద్, ఆలయ అర్చకులు ఆయనను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సిద్ధేశ్వర, పరకాల కుంకుమేశ్వర ఆలయాలకు కూడా ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.