TG: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పోలీసులకు పతకాలు అందించనున్నారు. ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసులు, అధికారులకు పతాకాలు ఇవ్వనున్నారు. TS జెన్కో విజిలెన్స్ &సెక్యూరిటి చీఫ్ ప్రతాప్‌కు సీఎం సర్వోన్నత పోలీసు పతకం అందిస్తారు. 16 మందికి మహోన్నత సేవా పతకాలు, 94 మందికి ఉత్తమ సేవా పతకాలు, 50 మందికి కఠినసేవా పతకాలు, మరో 461 మందికి సేవా పతకాలు ఇస్తారు.