NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీ సీట్ల సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. కమ్మ ర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థి యెనుగందుల సౌమిత్, విద్యార్థిని జాగర్ల శ్రీజ త్రిబుల్ ఐటీ బాసర క్యాంపస్లో సీట్లను సాధించారు. పలువురు వారిని అభినందించారు.