AKP: గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో సీపీఐ మాజీ ఎంపీపీ, కామ్రేడ్ లగుడు ఎర్రమనాయుడు 13వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన స్థూపం వద్ద పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ.. ఎర్రమ్మనాయుడు పేదల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడారని చెప్పారు.