PLD: వినుకొండలోని చెక్కవాగు వద్ద తడి, పొడి చెత్త శుద్ధి కేంద్రానికి సోమవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు రూ.2.02 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఈ భవన నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ నూతన కేంద్రంతో పట్టణం మరింత పరిశుభ్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.