ADB: జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలకు చెందిన వంశీ, గణేష్, ఇస్రు, కృష్ణ, నితిన్ అనే విద్యార్థులు భారత సైన్యంలో ప్రతిష్టాత్మకమైన అగ్ని వీర్ జనరల్ డ్యూటీ(GD) పోస్టులకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ శివకృష్ణ సోమవారం తెలిపారు. దేశ సేవలో విద్యార్థులు భాగస్వామ్యం కావటం గొప్ప విషయం అని అన్నారు. మిగతా విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.