KRNL: నందవరం (మ) కైరవాడిలో అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి తాగునీటి సమస్య ఏర్పడింది. నీటి కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజల పరిస్థితిని స్థానిక నేతలు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. స్పందించిన ఓ స్వచ్ఛంద సంస్థ గ్రామానికి తాగునీటి ట్యాంకర్లను పంపించింది. దీంతో వారు కృతజ్ఞతలు తెలిపారు.