PLD: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. ఆదివారం సత్తెనపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూకబ్జాలు, బెదిరింపులు బొల్లా బ్రహ్మనాయుడికి అలవాటుగా మారాయని ఆరోపించారు. మాజీ సైనికులు, మైనారిటీలు సహా పలువురి భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు.