»God Blessed Me Once Again I Will Be Chief Ministerjagan
once again chief minister:మరోసారి నేను సీఎం.. ఆ దేవుడు ఆశీర్వదించాడు: జగన్
once again chief minister:ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తానే సీఎం అవుతానని చెప్పారు. ఆ దేవుడు తనను దీవించాడని.. అర్థం చేసుకోవాలని కోరారు. మంచి మనసుతో చేసే పరిపాలనను ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడని అన్నారు. అందుకే వర్షాలు సమృద్దిగా పడుతున్నాయని పేర్కొన్నారు.
god blessed me, once again i will be chief minister:JAGAN
once again chief minister:ఏపీ సీఎం జగన్ (cm jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తానే సీఎం (cm) అవుతానని చెప్పారు. ఆ దేవుడు తనను దీవించాడని.. అర్థం చేసుకోవాలని కోరారు. మంచి మనసుతో చేసే పరిపాలనను ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడని అన్నారు. అందుకే వర్షాలు సమృద్దిగా పడుతున్నాయని పేర్కొన్నారు. నాలుగేళ్లలో అన్నీ చోట్ల వర్షాలు కురిశాయని చెప్పారు. ప్రతీ ఒక్క రిజర్వాయర్ కూడా నిండిందని అన్నారు. ప్రతీ ఒక్క చెరువు నిండిందని.. ప్రతీ గ్రామంలో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కుప్పం నియోజకవర్గం.. ఎడారిగా మారుతుందనే అనంతపురం (anantapuram) జిల్లాలో కూడా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వివరించారు. మంచి మనసు, మంచి పరిపాలన ఉంటే.. అక్కడ ఆ దేవుని ఆశీస్సులు కూడా తప్పకుండా ఉంటాయని చెప్పారు.
చదవండి:vallabhaneni vamsi on lokesh:ఇప్పుడు వంశీ.. పార్టీ మీ తాత ఖర్చూరనాయుడు పెట్టారా అంటూ?
12 లక్షల టన్నుల (12 lakhs tonnes) ఆహార ధాన్యాలు దిగుబడి పెరిగాయని సీఎం జగన్ (cm jagan) అన్నారు. బాబు హయాంలో 154 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి జరిగాయని చెప్పారు. తమ పాలనలో 166 లక్షల టన్నులకు పెరిగిందని చెప్పారు. నాలుగేళ్లలో ధాన్యం సేకరణ రికార్డు స్థాయికి చేరిందని తెలిపారు. 2.65 కోట్ల టన్నుల ధాన్యం చంద్రబాబు సేకరించారని వివరించారు. 2.94 కోట్ల టన్నుల ధాన్యాన్ని మూడేళ్ల 8 నెలల్లో సేకరించామని జగన్ వివరించారు.
ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఆహార ధాన్యాల కోసం రూ.40,237 కోట్లు వ్యయం చేస్తే.. మూడేళ్లలోనే తమ ప్రభుత్వం రూ. 55,444 కోట్ల వ్యయం చేసిందన్నారు. ఉద్యానపంటల విస్తీర్ణం కూడా తమ హయాంలో పెరిగిందని చెప్పారు. చంద్రబాబు 228 లక్షల టన్నులు దిగుబడి ఉండగా.. ఇప్పుడు 322 లక్షల టన్నులకు పెరిగిందని చెప్పారు. దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, దేవుడు దీవించాడు అని సీఎం జగన్ అన్నారు. మన కళ్ల ఎదుటే జరిగిన వాస్తవాలు అని జగన్ పేర్కొన్నారు. ప్రతీ ఇంట్లో అభివృద్ది కనిపిస్తోందని వివరించారు.