WGL: వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 3వ డివిజన్లో నీటి ఎద్దడిని నివారించేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కౌన్సిలర్ గుజ్జ వీరరాఘవ రావు శుక్రవారం సొంత నిధులతో కాలనీలో బోరు తవ్వించి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించిన వార్డు సభ్యుడికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.