SRD: రబీ వరి పంట పొలంలోని అవశేషాలను నిప్పు పెడితే జరిమానా తప్పదని ఖేడ్ ADA నూతన్ కుమార్ హెచ్చరించారు. ఈ అవశేషాలు కాల్చడం వల్ల గాలి కాలుష్యం పెరగడం, నేల సారం తగ్గడం, భూమిలో సూక్ష్మ జీవులు క్షిణిస్తాయి, పొగ కారణంగా ఆరోగ్య సమస్యలు ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. అవశేషాలను కాల్చితే రూ. 5వేలు నుంచి రూ. 25వేలు వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు.