IPL-2026లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. RRతో జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ గిల్ (104) అద్భుత సెంచరీతో చెలరేగగా, సాయి సుదర్శన్ (58) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో 215 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఈనెల 31న జరగబోయే ఫైనల్లో RCBతో GT తలపడనుంది.