GT ఓపెనర్ సాయి సుదర్శన్‌ను దురదృష్టం మరోసారి వెంటాడింది. గత మ్యాచ్‌లో ‘హిట్ వికెట్’గా వెనుదిరిగిన సుదర్శన్.. తాజాగా RRతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అదే తరహాలో ఔటయ్యాడు. 32 బంతుల్లోనే 58 పరుగులతో దూకుడుగా ఆడుతున్న సుదర్శన్.. బ్రిజేష్ శర్మ వేసిన బంతిని ఆడే క్రమంలో చేతిలో నుంచి బ్యాట్ జారిపోయి వికెట్ల మీద పడింది. దీంతో సుదర్శన్ నిరాశతో పెవిలియన్ చేరాడు.