RRతో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్లో GT కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 47 బంతుల్లోనే 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ సీజన్లో తన తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గిల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 700 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. కాగా, గిల్ IPL కెరీర్లో ఇది 5వ సెంచరీ కావడం విశేషం.