»Kamala Vikasam Again In North Eastern States Exit Polls Reveal
Exit polls : ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ కమల వికాసమే…ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
ఈశాన్య రాష్ట్రల్లో మళ్లీ కమలం వికసిస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీ( BJP) అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే మేఘాలయ (Meghalaya) రాష్ట్రంలో మాత్రం బీజేపీకి చుక్కెదురు అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఈశాన్య రాష్ట్రల్లో మళ్లీ కమలం వికసిస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీ( BJP) అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే మేఘాలయ (Meghalaya) రాష్ట్రంలో మాత్రం బీజేపీకి చుక్కెదురు అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 31. నాగాలాండ్ (Nagaland)రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ సీట్లలకు గానూ.. ఎన్డీపీపీ+బీజేపీ 35-43 సీట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 1-3, ఎన్పీఎఫ్ 2-5 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. త్రిపురలో లో ఎన్డీపీపీ+బీజేపీ కూటమి 60 అసెంబ్లీ సీట్లకు గానూ.. 36-45 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటుందని, లెఫ్ట్ పార్టీ 6-11 స్థానాలకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్ ఒక్కస్థానంలో కూడా గెలుచుకోదని జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
మేఘాలయాలో మాత్రం బీజేపీకి మెజారిటీ సీట్లు రావని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. మేఘాలయాలో 60 స్థానాల్లో 18-24 గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్(Congress) 6-12, బీజేపీ 4-8 స్థానాల్లో గెలుపొందుతాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే జీ న్యూస్-మాట్రిజ్ మాత్రం ఎన్పీపీ 21-26, బీజేపీ 6-11, కాంగ్రెస్ 3-6 స్థానాలు గెలుపొందుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాజపా అధికారంలో ఉంది. త్రిపుర (Tripura)లో మాణిక్ సాహా నేతృత్వంలోని బీజేపీ BJP) సర్కారు పాలిస్తుండా, మేఘాలయ (Meghalaya), నాగాలాండ్ (Nagaland)లో కాషాయ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది.ఈ ఏడాది మొత్తం 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరగబోతున్నాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ తర్వాత కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభల పదవీకాలాలు ఈ ఏడాదిలోనే ముగియనున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలను(Assembly elections) అందుకే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నారు.