AP: రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయాలను చూసి ప్రజలు నివ్వెరపోతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. కాంగ్రెస్, BJPతో ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారని, చంద్రబాబు రాజకీయాలను BJP గమనిస్తోందని అన్నారు. మెగా DSCలో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని.. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే YCPని గొడ్డలి పార్టీ అంటూ TDP బురద జల్లుతోందని ఆరోపించారు.