WGL: ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు జూన్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గుమస్తా, అడ్తి, చిల్లిస్ సెక్షన్ల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మళ్లీ 6వ తేదీన మార్కెట్ పునఃప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు.