kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (liquor scam) నెక్ట్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేత వివేక్ అన్నారు. నిన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి కవిత అరెస్ట్ అవుతారని చెప్పారు. ఎన్నికల ఖర్చు కోసం ఆప్‌కు కల్వకుంట్ల కవిత రూ.150 కోట్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు.
next kavitha will be arrested on liquor scam case:vivek
kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (liquor scam) నెక్ట్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేత వివేక్ (vivek) అన్నారు. నిన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను (manish sisodia) సీబీఐ అధికారులు (cbi) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి కవిత (kavitha) అరెస్ట్ అవుతారని చెప్పారు. ఎన్నికల ఖర్చు కోసం ఆద్ ఆద్మీ పార్టీకి కల్వకుంట్ల కవిత రూ.150 కోట్లు (150 crores) ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా లిక్కర్ వ్యవహారం .. ఢిల్లీ, పంజాబ్‌లో చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తిరుమలలో శ్రీవారిని వివేక్ దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ (cm kcr) దోచుకున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్మును ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. దోపిడీ చేసిన డబ్బుతో దేశమంతా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. లిక్కర్ స్కామ్‌లో ఒక్క కవిత (kavitha) కాదే.. ఇంకా చాలా మంది అరెస్ట్ అవుతారని తెలిపారు. ప్రజల్లో కేసీఆర్‌పై (kcr) వ్యతిరేకత ఉందని వివేక్ తెలిపారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీని తెరపైకి తీసుకొచ్చారని వివరించారు. ఔట్ డేటెడ్ నాయకులే ఆ పార్టీలో చేరుతున్నారని సెటైర్లు వేశారు.
చదవండి:arvind Kejriwal:చాలామంది సీబీఐ అధికారులు సిసోడియా అరెస్ట్‌ను వ్యతిరేకించారు
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను (sisidia) నిన్న దాదాపు 8 గంటల పాటు సుధీర్ఘంగా ప్రశ్నించి.. సరైన సమాధానాలు చెప్పలేదని అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు ఆప్ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని చాలా మంది సీబీఐ అధికారులు వ్యతిరేకిస్తున్నారని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind Kejriwal) అన్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురి పేర్లను సీబీఐ(CBI) అధికారులు చేర్చారు. ఆ లిస్ట్ లో తొలుత మనీశ్ సిసోడియా పేరు లేదు. తర్వాత ఆధారాలతో అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ టెండర్లు కట్టబెట్టారనే నేపథ్యంలో మనీశ్ సిసోడియా(Manish Sisodia)పై పలు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ 12 మందిని సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవ ఉన్నారు.