VZM: తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.