ADB: త్యాగానికి, భక్తిశ్రద్ధలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికీ కలెక్టర్ రాజర్షి షా హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దైవప్రేమ, త్యాగనిరతి, కరుణ, మానవతా విలువలను చాటిచెప్పే గొప్ప పండుగ బక్రీద్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ పండుగ ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు.