తిరుపతి జిల్లాలో భూగర్భ జలాలు మెరుగుపడ్డాయి. ఏప్రిల్-2026తో పోలిస్తే పలు మండలాల్లో నీటి మట్టం పెరిగినట్లు ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగం వెల్లడించింది. తిరుపతి అర్బన్ 3.79 మీటర్లు, పెనగలూరు 9.09 మీ, ఒబులవారిపల్లె 2.76 మీటర్ల మేర పెరిగాయి. అయితే బుచ్చినాయుడు కండ్రిగ, పుత్తూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టాయి.